తెలంగాణలో ఎన్నికల సంగ్రామంలో చివరి అంకానికి చేరింది. రేపు ( డిసెంబర్ 3)న తెలంగాణ కింగ్ ఎవరో తెలిపోనుంది. అయితే ఆరోజు ( డిసెంబర్ 3) తిథి వార నక్షత్రాలు ఎలా ఉన్నాయి.. అన్నీ పార్టీల బడా నేతలు ఆరోజు వారికి ఎంతవరకు అనుకూలం.. ఎంతమేరకు ప్రతికూలం అనే విషయాలను సంఖ్యా శాస్త్ర నిపుణులను సంప్రదిస్తున్నారు. అసలు రేపు ( డిసెంబర్ 3) తిథి, వార, నక్షత్రం మొదలగు వివరాలను తెలుసుకుందాం. . ..
డిసెంబర్ 3 , 2023 పంచాంగ వివరాలు
- శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
- దక్షిణాయణం
- కృష్ణ పక్షము శరత్ ఋతువు
- తిథి: షష్టి 17:14 వరకు
- నక్షత్రం : ఆశ్లేష 18:54 వరకు
- మాసం: కార్తీక మాసం
- అమృతకాలము: 0749 నుండి 03–36 వరకు
- సూర్యోదయము: 06:31
- సూర్యాస్తమయము: 17:40
- రాహు కాలం: సాయంత్రం 4:13 నుండి సాయంత్రం 5:36 వరకు
- యమగండము: మధ్యాహ్నం 12:05 నుండి 01:28 వరకు
- దుర్ముహుర్తములు: ఉదయం 11:02 నుంచి మధ్యాహ్నం 01:31 వరకు
- సాయంత్రం 04:08 నుండి సాయంత్రం 04:52 వరకు, రాత్రి 07:15 నుండి రాత్రి 08:00 వరకు
- అభిజిత్: ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:28 వరకు
- కరణం:వనిజ రాత్రి 06–17 వరకు
- వర్జ్యం: ఉదయం 09:08 నుంచి ఉదయం 10:55 వరకు
- చంద్రోదయం: 10:08
- గుళిక కాలం: 06:31 నుండి 07:54 వరకు
- యోగా: బ్రహ్మ 20:19 వరకు
సంఖ్యా శాస్త్రం ప్రకారం సాధారణంగా షష్టి తిథి రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రేపు డిసెంబర్3న అశ్వని, కృత్తిక , మృగశిర, పునర్వసు, పుష్యమి,మఖ,ఉత్తర , చిత్త, విశాఖ,అనూరాధ, మూల, ఉత్తరాషాడ, ధనిష్ట,పూర్వభాధ్ర, ఉత్తరాబాధ్ర నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉందని సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలుస్తోంది.